EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

ఆయిల్ ఫామ్ సాగుతో ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ.

📰 Generate e-Paper Clip

ఖర్చు తక్కువ…ఆదాయం ఎక్కువ.

-నష్టాల ఉసెలేని ఆయిల్ ఫామ్ సాగు.

-ఆయిల్ ఫామ్  సాగుతో  నిరంతరం అధిక లాభాలు.

-పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.


జనం వాయిస్,సుల్తానాబాద్ :

72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా 35 సంవత్సరాల పాటు  అధిక  లాభాలు వస్తాయని తెలిపారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని,అలాగే తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు,డ్రిప్పు  పరికరాలు  అందించి సాగును ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఒక్కసారి మొక్కలు నాటితే మూడు సంవత్సరాల తర్వాత నిరంతరం 35 సంవత్సరాల పాటు అధిక లాభాలు వస్తాయన్నారు.సాగు చేస్తున్నంత కాలం చీడపీడల బెడద తక్కువ,అలాగే తక్కువ కూలీలు అవసరం ఉంటుందని తెలిపారు. మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు కూడా వేసుకోవచ్చునని పేర్కొన్నారు.వరి తో పోలిస్తే నాలుగు రేట్లు ఆదాయం ఎక్కువ,ప్రకృతి వైపారీత్యాల వల్ల వానలు,వరదలు వచ్చిన ఆయిల్ ఫామ్ పంటకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ అంతటి అన్నయ్య గౌడ్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు,సింగిల్ విండో ఛైర్మెన్ శ్రీగిరి శ్రీనివాస్,సింగిల్ విండో డైరెక్టర్ పన్నాల రాములు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్ నాయక్ దామోదర్,సీఈఓ బూరుగు సంతోష్,ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు, సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!