EPAPER
Friday, April 3, 2026
Google search engine

ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం.

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే సహకారంతో 99 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం.

జనం వాయిస్, పెద్దపల్లి :

గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ లో బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన పెద్దపల్లి ఎమ్మెల్యే కు గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.గత కొన్ని సంవత్సరాల నుండి మరమ్మత్తులు కూడా నోచుకోకుండా ఉండడంతో రెండు సంవత్సరాలకోకసారి సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యేకు తమ సమస్యను గ్రామ ప్రజలు విన్నవించుకున్నారు.ప్రజా ప్రభుత్వంలో గ్రామ ప్రజలు మరియు నాయకుల విన్నపం మేరకు ఈసారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామ సమీపాన కెనాల్ ప్రక్క నుండి  సమ్మక్క సారక్క గద్దెల వరకు నూతన బిటి రోడ్ నిర్మాణానికి 99 లక్షల నిధుల తో పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణ రావు శంకుస్థాపన చేశారు.ఈ బిటి రోడ్ నిర్మాణం వల్ల నారాయణ పూర్, కోదురుపాకా, ముప్పిరి తోట, ర్యాకల్ దేవ్ గ్రామాల రైతులకు, జాతరకు వచ్చే భక్తులకు ఈ రోడ్డు దగ్గర కానుంది. రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామ సర్పంచ్ గుడుగుల సతీష్, కొదురుపాక సర్పంచ్ ఉత్తమ కుమారి, మాజీ ఎంపీటీసీ మండల రమేష్, మాజీ సర్పంచ్ సాగర్ రావు, కొదురుపాక ఉప సర్పంచ్ తిరుపతిరావు, కొండల్ రావు, ఉప సర్పంచ్  రామరావు, పన్నాల రాములు, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, చిలుక సతీష్, సర్పంచులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!