ఏసీబీ తనిఖీలలో చిక్కిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, ఫిబ్రవరి- 25:
ఏసీబీ తనిఖీల్లో చిక్కిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే. అలివేణి ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జరుగుతున్న అవకతవకల గురించి సమాచారం అందుకున్న ఏసీబీ శాఖ ఫిబ్రవరి 24న ఆకస్మిక తనిఖీలు నిర్వహించిందని, ఆ తనీఖీలలో పట్టుబడిన పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కే. అలీవేణి ను సస్పెండ్ చేస్తున్నామని, మండల వ్యవసాయ అధికారి పై క్రమశిక్షణ చర్యలు విచారణ ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని, సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఆ ఉత్తర్వులలో కలెక్టర్ పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments