పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.
-కటింగ్ లు లేకుండా కొనుగోల్లు.
-48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు.
-రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దు.
-రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.
-పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు.
జనం వాయిస్, పెద్దపల్లి:
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో పరిధిలోని ఐతరాజుపల్లి మరియు గర్రెపల్లి గ్రామాల్లో అలాగే ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ మరియు ఎలిగేడు గ్రామాల్లో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో మరియు అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు గాను పంటలు కోల్పోయి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అన్నారు.రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని కోరారు.నష్టాలను అంచనా వేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుండి 5వ సారి కొనుగోల్లు జరుపుతున్నామని,ఎప్పటిలాగే ఏ సెంటర్లో కూడా రైతులకు సమస్య రానీయమని చెప్పారు.ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు.రైతులు కూడా వడ్లను ఆరబెట్టి 17 శాతం లోపు తేమ ఉండేట్టు చూడాలని కోరారు.వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు.కేవలం కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి ట్రక్ షీట్లు పొంది రైతులు ఇండ్లలో ఉండచ్చని,రైస్ మిల్లులకు తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తమకు రైతులు నేరుగా సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు,సింగిల్ విండో చైర్మన్లు,డైరక్టర్లు, మండల పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments