పైలట్ శిక్షణ విద్యార్థినిపై అత్యాచారం.!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
హైదరాబాద్ బేగంపేట లోని ‘ఏవికన్స్ పైలెట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్’లో పైలెట్ కోర్సు అభ్యసిస్తున్న ఒక యువతిపై అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నసిముద్దీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. జనవరి 2025 నుంచి శిక్షణ ఇస్తాననే సాకుతో ఆమెపై పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బాధితురాలు ధైర్యం చేసి బేగంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ అరాచకం బయటపడింది. కేరళ రాష్ట్రానికి చెందిన నసిముద్దీన్‌కు దమ్మాయిగూడకు చెందిన మరో ఇన్‌స్ట్రక్టర్ సల్మాన్ కూడా సహకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు నసిముద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నా రు. ఒకే సంస్థలో పనిచేస్తూ విద్యార్థినికి అండగా ఉండవలసిన వీరు క్రూరంగా వ్యవహరించి ఆమె జీవితంతో ఆడుకున్నారు. నరరూప రాక్షసులు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments