ఏలూరు జిల్లాలో ప్రవేట్ ట్రావెల్ బస్సు బోల్తా.
జనం వాయిస్, వెబ్:
ఏలూరు జిల్లా:నవంబర్ 04
నిన్న కర్నూలు,నేడు చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే, ఏలూరు వద్ద మంగళవారం ఉదయం మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న భారతి ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లా లింగంపాలెం సమీపంలోని జూబ్లీనగర్ వద్ద బోల్తా పడింది.ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 13 మందికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీప ఆసుపత్రు లకు తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.విషయం తెలిసిన వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments