ఆర్ఎంపీల పైన ఆరోగ్యశాఖ అధికారుల ఆంక్షలు కరువు.
-అర్హత లేని ఆర్ఎంపీల సొంత హాస్పిటల్ లపై తనిఖీలు నిర్వహించాలి.
-డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్.
జనం వాయిస్,మంథని:
అర్హత లేని ఆర్ఎంపీల సొంత హాస్పిటల్ పై తనిఖీలు నిర్వహించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ అధికారులను కోరారు.మంథని మున్సిపల్ పరిధిలో కొందరు ఆర్ఎంపీలు గ్రామాల్లో ప్రథమ చికిత్స చేయడం మరిచి మంథని పట్టణ కేంద్రంలో అర్హత లేకున్నా సొంతంగా ఆస్పత్రులు నిర్వహించి మెడికల్ షాపులను సైతం ఏర్పాటు చేసుకొని తప్పుడు వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.

గతంలో మంథని డివిజన్ కేంద్రంలో ఆర్ఎంపీల వైద్యం వికటించి అనేకమంది యువతి,యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఓపి బిల్లు లేదంటూ నిరుపేదల రాకను ఆసరాగా చేసుకొని ఒకే రకమైన మాత్రలు ఇస్తూ అవసరం లేకున్నా సెలైన్లు ఎక్కించి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమకు ఇష్టమైన రీతిలో యాంటీబయాటిక్స్,నొప్పుల మాత్రలు అడ్డగోలుగా రాసి బలవంతంగా పేషంట్లతోని తమ మెడికల్ షాపులోనే మందులను కొనిపించి సొమ్ము చేసుకుంటున్నారని,అర్హత లేకున్నా మందులు అమ్మడం ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ల బోర్డు పెట్టి లోపల మూడు రూములు ఐదు బెడ్లతో పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తుండడం పట్ల అగ్రహం వ్యక్తం చేస్తూ క్లినిక్ ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ల హాస్పిటల్స్ మీద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించాలని కోరారు.కాగా గత పది రోజుల క్రితం మంథని కేంద్రంలో అనుమతులు లేని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల్లో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వడంతోనే సరిపెట్టగా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు అర్హత లేని ఆర్ఎంపీలు ఏర్పాటుచేసిన ఆస్పత్రులను తనిఖీలు చేయడం మరిచారని మరొకసారి అనుమతులేని పలు ప్రైవేట్ హాస్పిటల్ ల తోపాటు ఆర్ఎంపీలు సొంతంగా నిర్వహించి వైద్యం చేస్తున్న ఫస్ట్‌ఎయిడ్ క్లినిక్ ల పేరిట వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీల హాస్పటల్ల మీద సైతం తనిఖీలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments