అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు.
-మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
జనం వాయిస్, మంథని:
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తేనే మంచి గుర్తింపు ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు.ఆర్ జి త్రీ ఏరియా ఓసిపి టు మైన్ లో పనిచేసిన ఏగోలపు మల్లయ్య , మోత్కూరీ వెంకటేశ్వర్లు పదవి విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం వారు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. అనంతరం పదవి విరమణ పొందిన మల్లయ్య, మోత్కూరి వెంకటేశ్వర్లు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు పదవి విరమణ అనంతరం దంపతులు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆయురారోగ్యాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments