42 శాతం రిజర్వేషన్లతోనే జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికలు నిర్వహించాలి: ఆర్.కృష్ణయ్య!
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 15:
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచా యతీ ఎన్నికల సందర్భంగా స్పష్టం కావడంతో ఇదే సమయంలో పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని అంచనా వేస్తోంది.
దీంతో ఈ నెలలోనే ఎంపీ టీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా అందిన మౌఖిక ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాగానే ఎన్నికల సంఘానికి సమాచారం అందించేందుకు అధికా రులు పని చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు తొలి విడత ఇప్పటికే పూర్తి కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి.
మూడో విడత 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వం సిద్ధమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి తెలియజేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే సిద్ధం చేసిన ఓటర్ల జాబితా, మండల, జడ్పీ టిసిల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉండడంతో ఇక ఎన్ని కలకు వెళ్లడమే తరువాయి అని చెబుతున్నారు. జడ్పిటిసి,ఎంపిటిసి, ఎన్నికల ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల తోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పార్టీల పరంగా జరిగే ఈ ఎన్నికల్లో చట్టబద్ధంగా 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో 42% హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments