EPAPER
Thursday, April 2, 2026
Google search engine

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.-రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని.

📰 Generate e-Paper Clip

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.-రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని.

-పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు కలుగకూడదు.

-పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్.

జనం వాయిస్,పెద్దపల్లి, డిసెంబర్ 09:

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో మంగళవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎన్నికల పరిశీలకులు అనుగు నరసింహారెడ్డి, డిసిపి రాంరెడ్డి లతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు మొదటి విడత గ్రామపంచాయితీ ఎన్నికలను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని  అధికారులను ఆదేశించారు.ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కొరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సామాగ్రి పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని అన్నారు.ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, రెండు వందల మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తులు ఉండకుండా చూడాలన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్ ఎన్నికలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయాలన్నారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!