EPAPER
Monday, February 16, 2026
Google search engine

30-11-2025 ఆదివారం.-రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

30-11-2025 ఆదివారం.-రాశి ఫలితాలు.
—————————————
మేషం

దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
—————————————
వృషభం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.
—————————————
మిధునం

ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు.
—————————————
కర్కాటకం

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.  స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.
—————————————
సింహం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బందు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై  చర్చలు చేస్తారు.
—————————————
కన్య

దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి.
—————————————
తుల

చిన్న పాటి అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు.
—————————————
వృశ్చికం

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.
—————————————
ధనస్సు

వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మౌతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.
—————————————
మకరం

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
—————————————
కుంభం

వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
—————————————
మీనం

వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!