EPAPER
Thursday, April 2, 2026
Google search engine

01-12-2025 సోమవారం.రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

01-12-2025 సోమవారం.రాశి ఫలితాలు.
—————————————
మేషం

బంధు మిత్రుల  నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి  కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో   సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.
—————————————
వృషభం

కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక  నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో  కొంత శ్రద్ద వహించాలి.
—————————————
మిధునం

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక  విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  చిన్ననాటి  మిత్రులతో  గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
—————————————
కర్కాటకం

సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు.
—————————————
సింహం

ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
—————————————
కన్య

చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది    ఇంటా బయట  బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి.  ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు.
—————————————
తుల

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రాంత  బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు.
—————————————
వృశ్చికం

గృహమున సన్నిహితులతో  ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద  సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.
—————————————
ధనస్సు

వ్యాపారాలలో మిశ్రమ  ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ  అవసరాలకు ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.  ఇతరులతో తొందరపడి మాట్లాడటం  మంచిది కాదు.
—————————————
మకరం

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది.  చేపట్టిన  వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం  పొందుతారు.
—————————————
కుంభం

వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు. సంతాన  విద్యా విషయాలపై  దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు  చురుకుగా పాల్గొంటారు.
—————————————
మీనం

ఇతరుల నుండి  విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. స్ధిరాస్తి  వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి  దైర్యంగా  ముందుకు సాగుతారు.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!