EPAPER
Monday, February 16, 2026
Google search engine

05-12-2025 శుక్రవారం.-రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

05-12-2025 శుక్రవారం.-రాశి ఫలితాలు.
—————————————
మేషం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
—————————————
వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
—————————————
మిధునం

అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమునకు కొందరి  ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు.  ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
—————————————
కర్కాటకం

ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో  విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో  దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
—————————————
సింహం

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
—————————————
కన్య

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఋణ సమస్యల  నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
—————————————
తుల

పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
—————————————
వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.
—————————————
ధనస్సు

బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.
—————————————
మకరం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో  బాధ్యతలను  సమర్థవంతంగా  నిర్వహిస్తారు.
—————————————
కుంభం

ఇంటా బయట  మీ  మాటకు విలువ  పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
—————————————
మీనం

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!