EPAPER
Monday, February 16, 2026
Google search engine

23-12-2025 మంగళవారం..రాశి ఫలితాలు.

📰 Generate e-Paper Clip

23-12-2025 మంగళవారం..రాశి ఫలితాలు.
—————————————
మేషం

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.  వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
—————————————
వృషభం

చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.
—————————————
మిధునం

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన  పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
—————————————
కర్కాటకం

బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
సింహం

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————
కన్య

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
—————————————
తుల

సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.
—————————————
వృశ్చికం

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి.
—————————————
ధనస్సు

ముఖ్యమైన  పనులు కొన్ని వాయిదా వేస్తారు. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో  అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహ  పరుస్తాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి.
—————————————
మకరం

దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో  సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
—————————————
కుంభం

బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.  చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
—————————————
మీనం

వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి.
—————————————


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!