EPAPER
Thursday, August 6, 2026
Google search engine

ఆగస్టు 15 నుంచి రేషన్ కార్డులు.

📰 Generate e-Paper Clip

ఆగస్టు 15 నుంచి రేషన్ కార్డులు.

డెబిట్ కార్డు సైజులో బార్‌కోడ్‌తో రానున్న కొత్త కార్డులు.

జనం వాయిస్, హైదరాబాద్, ఆగస్టు 06:

తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. సంగారెడ్డి వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమం వివరాలను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమోదించారని ఆయన తెలిపారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు) ఈ పంపిణీని పర్యవేక్షిస్తారు. లబ్ధిదారుల తుది జాబితాలను సిద్ధం చేసి, పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.నూతనంగా రూపకల్పన చేసిన ఈ రేషన్ కార్డులు లామినేషన్‌తో డెబిట్ కార్డు తరహాలో సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్డుల్లా కాకుండా, వీటిపై కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లకు బదులుగా ఒక విశిష్ట సంఖ్య, బార్‌కోడ్ మాత్రమే ఉంటాయి. ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. నూతనంగా అర్హత పొందిన కుటుంబాలకు సంపూర్ణ ఆహార భద్రత కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!