రూ”2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన.!
జనం వాయిస్, హైదరాబాద్, జులై 09:
దేశంలో అత్యధిక విలువ కలిగిన రూ.2,000 నోట్ల చలామణికి సంబం ధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక అత్యంత కీలకమైన అధికారిక ప్రకటన విడుదల చేసింది. మార్కెట్లో చలామణి లో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో దాదాపు 98.47 శాతం నోట్లు విజయ వంతంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వెనక్కి వచ్చినట్లు దేశ కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.
దాదాపు మూడేళ్ల క్రితం కరెన్సీ నిర్వహణ పరిపాలనా వ్యూహం లో భాగంగా ఈ పింక్ కలర్ పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ, తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవ త్సర గణాంకాలను దేశ ప్రజల ముందుకు ఉంచింది.
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2023 మే 19వ తేదీన రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన ఆరంభ సమయంలో మార్కెట్లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయి.
అయితే కాలక్రమేణా బ్యాంకులు మరియు నిర్దేశిత కేంద్రాల ద్వారా ఈ నోట్ల డిపా జిట్లు నిరంతరాయం గా కొనసాగడంతో, తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి మార్కెట్లో ఇంకా తిరిగి రాకుండా మిగిలి ఉన్న నోట్ల విలువ కేవలం రూ.5,451 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది.
రూ “2000నోట్లు మార్కెట్ చలామణి నుండి ఉపసంహరిం చుకున్నప్పటికీ అవి ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతా యని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టమైన హామీ ఇచ్చింది, ఒకవేళ ఎవరి వద్దనైనా ఇంకా రూ 2000 నోట్లు మిగిలి ఉంటే వాటిని మార్చుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది.
తమ బ్యాంకు ఖాతా ల్లో జమ చేసుకునేం దుకు ప్రత్యేక సదు పాయాన్ని కల్పిస్తున్న ట్లు తెలిపింది. వీలై నంత త్వరగా రూ” 2000 రూపాయల నోట్లను మార్చుకోవా లని ఆర్బిఐ సూచించింది
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments