కారు ఢీకొని చిన్నారి మృతి..
జనం వాయిస్,సుల్తానాబాద్, నవంబర్ 16:
సెలవు రోజు కావడంతో తమ్ముడిని కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుందామని వచ్చిన చిన్నారికి కారు రూపంలో మృత్యువు ఎదురై అనంత లోకాలకు చేరుకుంది. తమ్ముడిని కలిసిన ఆనందం కాసే పైన లేకుండానే మృతి చెందడంతో తమ్ముడు తో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం, తుళ్లూరు గ్రామానికి చెందిన శివ హాసిని ( 8 ) సంవత్సరాలు తన తమ్ముడు మొట శ్రావణ్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తుండ గా ఆదివారం సెలవు రోజు కావడంతో నానమ్మ లక్ష్మి, పెద్దమ్మ లతో కలిసి తమ్ముడి వద్దకు వచ్చి తన తమ్ముడి తో సరదాగా గడుపుదామని హాస్టల్ నుండి నలుగురు బయటికి వచ్చి రోడ్డు దాటుతుండగా కారు రూపంలో వచ్చిన మృత్యు శివ హాసిని ని ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా హుటా హుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందిందని బంధువులు తెలిపారు. మృతురాలి తల్లి తండ్రి కిషోర్ లావణ్య ల కు సమాచారం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని మార్చిలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments