EPAPER
Monday, February 16, 2026
Google search engine

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే సర్పంచ్ గా గెలిపించాలి.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే సర్పంచ్ గా గెలిపించాలి.
-గద్దలపల్లి ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు సర్వేశ్.

జనం వాయిస్, మంథని:

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే సర్పంచ్ గా గెలిపించాలని గద్దలపల్లి ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు సర్వేశ్ తెలిపారు.మంథని మండలం గద్దలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కోరవేని కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా సర్వేశ్ కార్యకర్తలతొ  మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇతర పార్టీల నాయకులు చేసే ప్రలోభాలకు లొంగకుండా,సైనికులలా గా పనిచేయాలని ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటుతో సమాధానం చెప్పే విధంగా ఉండాలని కోరారు.పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికి మద్దతు తెలిపినట్లైతే పార్టీ హై కమాండ్ సూచనల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని తెలియజేశారు.ఇదే క్రమంలో కార్యకర్తలు నాయకులతో పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు మన గ్రామానికి మన ప్రజలందరికీ ఉండాలని కోరుకునే ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!