హైదరాబాద్ కోఠిలో కాల్పుల కలకలం.
– ఎస్బీఐ ఏటీఎం వద్ద గన్‌తో కాల్పులు, రూ.6 లక్షల దోపిడీ.
– డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్‌పై దాడి.
– సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు.
జనం వాయిస్, హైదరాబాద్:
హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. కోఠిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద దుండగులు గన్‌తో కాల్పులు జరిపి ఆరు లక్షల రూపాయల నగదుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చిన రషీద్‌పై దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో రషీద్‌కు గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
నగరంలో వరుసగా జరుగుతున్న నేరాల నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments