EPAPER
Saturday, March 7, 2026
Google search engine

సర్పంచి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో శ్రమదానం.

📰 Generate e-Paper Clip

సర్పంచి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో శ్రమదానం.


జనం వాయిస్, మహాదేవపూర్:


కాంగ్రెస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహాదేవపూర్ మండలం కుదురుపల్లి సర్పంచి చల్ల సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గం, కార్యదర్శి, ఉపాధ్యాయులు,పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శనివారం ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శ్రమదానం నిర్వహించారు.చెత్తను తొలగించి, పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. అనంతరం సర్పంచి చల్ల సమ్మిరెడ్డి మాట్లాడుతూ సామూహికంగా శ్రమదానం చేయడం వల్ల ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని అన్నారు. చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరకుండా ఉంటాయని,పాఠశాల విద్యార్థులకు ఆరోగ్యం, పరిసరాల శుభ్రత పై అవగాహన కల్పించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!