EPAPER
Thursday, April 2, 2026
Google search engine

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ.

📰 Generate e-Paper Clip

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్ పంపిణీ.

జనం వాయిస్,గోదావరిఖని,సప్తగిరి కాలనీ:

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు నాసా కిట్స్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (IPS) శనివారం పంపిణీ చేశారు.మొత్తం 18 మంది విద్యార్థులకు నాసా రూపొందించిన ప్రత్యేక కిట్స్‌ను అందజేశారు.ఈ సందర్భంగా సీపీ విద్యార్థులతో మాట్లాడుతూ, వారు నాసా ప్రాజెక్ట్ “GALACTRIX COLONY – Futuristic Settlement within the Galaxy” (థీమ్: Space Colony)లో మరింత మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.చిన్న వయసులోనే అంతరిక్షంపై అవగాహన పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను ఆయన అభినందించారు.పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ,విద్యార్థులు కొత్త పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. భూమి నివాసయోగ్యం కాని పరిస్థితులలో అంతరిక్ష వాతావరణంపై అవగాహన పెంచుకోవడం భవిష్యత్తులో ఎంతో అవసరమని పేర్కొన్నారు.అనంతరం నాసా ప్రత్యేకంగా తయారుచేసిన టీషర్టులు, పెన్లు, నోట్‌బుక్లు విద్యార్థులకు అందజేసి వారిని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ వెంకటస్వామి, C–బ్యాచ్ ఇన్‌చార్జ్ అనిల్, నాసా ఇన్‌చార్జ్ ఝాన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, జోనల్ ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు అభినందించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!