టాస్క్ సెంటర్ ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా ఎంపికైన ప్రైవేట్ ఉద్యోగులు.
జనం వాయిస్,పెద్దపల్లి,నవంబర్-01:
పెద్దపల్లి రీజినల్ టాస్క్ సెంటర్ టాస్క్ సెంటర్ ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.పెద్దపల్లి రీజనల్ టాక్స్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువత శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,పెద్దపల్లి రీజినల్ టాస్క్ సెంటర్ లో వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రైవేట్ కంపెనీలలో మంచి ప్యాకేజీ లతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.పెద్దపల్లి రీజినల్ టాస్క్ సెంటర్ లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ కోర్సులలో శిక్షణ ఉచితంగా అందించి ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు రీజనల్ టాస్క్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ నందు నూతనంగా ఉద్యోగాలకు ఎంపికైన గుర్రాల సింధుజ, పెర్క సాయి సింధు, మినీష ఓడనాలా లను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్, రీజినల్ టాస్క్ సెంటర్ ఇంచార్జి కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments