సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.
– నియతి ఆయోగ్ తాజా నివేదిక
జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31:
తెలంగాణ రాష్ట్రం మరోసారి జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. 2025 అక్టోబర్‌లో విడుదలైన నియతి ఆయోగ్ (NITI Aayog) తాజా నివేదిక ప్రకారం, 2014 నుండి 2023-24 వరకు దేశంలో సేవల రంగంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణగా నిలిచింది.
రాష్ట్ర స్థూల విలువ (GSVA)లో సేవల రంగం వాటా 9.6% పెరుగుదల నమోదు చేసింది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా 2011-12లో 52.8% ఉండగా,2023-24 నాటికి 62.4% కు పెరిగింది. దశాబ్ద కాలంలో సగటు వాటా 60.3%గా నమోదైంది.భారతరాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతృత్వంలోని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, సమాచార సాంకేతికత ఆధారిత ఆర్థిక విధానాలు ఈ వృద్ధికి బలమైన పునాదిగా నిలిచాయని నివేదిక పేర్కొంది.టి-హబ్, టి-వర్క్స్, వీ-హబ్, ఇమేజ్ వంటి సృజనాత్మక సంస్థలను ఏర్పాటు చేసి, స్టార్టప్‌లు మరియు టెక్నాలజీ రంగ అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ సమగ్ర వృద్ధి ఎకోసిస్టమ్ తెలంగాణను దేశంలో సేవల రంగానికి హబ్‌గా మార్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు.మేము తెలంగాణను ప్రతి ఒక్కరికి గర్వకారణంగా నిలిచే రాష్ట్రంగా తీర్చిదిద్దాం. దృఢమైన విధానాలు, దూరదృష్టి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే వృద్ధి సాధ్యమవుతుంది,” అని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments