కొత్తగూడెంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.
– మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు.
– సిపిఎం మద్దతుతో 28కి చేరిన కాంగ్రెస్ బలం.
– మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాల చొప్పున పంచుకునే ఒప్పందం.
జనం వాయిస్, కొత్తగూడెం, ఫిబ్రవరి 15:
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామంతో కార్పొరేషన్‌లో అధికార సమీకరణాలు కీలక మలుపు తిరిగాయి.
సిపిఎం మద్దతుతో కలిపి కాంగ్రెస్ బలం 28కి చేరినట్లు సమాచారం. ఈ మార్పుతో కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం బలపడినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశమైంది. మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాల చొప్పున పంచుకునేలా సిపిఐ–కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ అవగాహనతో కార్పొరేషన్ పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో జరిగిన ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అధికార మార్పిడి, మేయర్ ఎన్నికల ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments