EPAPER
Friday, April 10, 2026
Google search engine

భార్యా భర్తల గలీజ్ దందా..!

📰 Generate e-Paper Clip

భార్యా భర్తల గలీజ్ దందా..!

జనం వాయిస్, మంచిర్యాల:

100 మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు.

సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి వశపర్చుకుంటున్న భార్య.. అనంతరం శృంగార చేసి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు.తనకి మంచిర్యాలకు చెందిన మహిళ (29)తో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో.. సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించిన భార్యాభర్తలు. కొందరు వ్యాపారులు, యువకులు వారి వలలో పడగ.. ఆమె వారిని తన అపార్ట్మెంట్ ‘కు పిలిచి.. వారితో సన్నిహితంగా ఉండగా ఆమె భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడు. తర్వాత బాధితులకు ఫోన్ చేసి.. వీడియోలు అందరికీ చూపిస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్న దంపతులు. ఇలా మూడేళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలు, కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని  సైతం బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు దండుకొని.. మరో సారి రూ.5 లక్షలు కావాలి అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. ఆ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!