EPAPER
Sunday, February 15, 2026
Google search engine

బీసీ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ ను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.

📰 Generate e-Paper Clip

బీసీ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ ను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.

– రాజస్థాన్, గుజరాతి మార్వాడిలు స్థానికంగా తీసుకున్న బీసీ సర్టిఫికేట్లు రద్దు చేయాలి.

– మాదిగ హక్కుల దండోరా డిమాండ్.

జనం వాయిస్, చెన్నూర్:

అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న బీసీ ఉద్యమ నాయకుడు సిద్ది రమేష్ యాదవ్ పై బెదిరింపులు చేస్తున్న చెన్నూర్ లో స్థిరపడ్డ రాజస్థాని మార్వాడి వర్గానికి చెందిన శ్యామసుందర్ దేవడా ను వెంటనే అరెస్ట్ చేయాలనీ, అలాగే ఇక్కడ స్థిరపడ్డ రాజస్థాని గుజరాతి మార్వాడీలకు ఇచ్చిన బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు వెంటనే రద్దు చేయాలనీ మాదిగ హక్కుల దండోరా తరపున డిమాండ్ చేశారు. అక్రమంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు పొందాలని చూస్తున్న మార్వాడిల కుట్రను పసిగట్టి దానికి అడ్డుకట్ట వేసినందుకు రమేశ్ యాదవ్ మీద దాడికి పాల్పడాలనే కుట్రతో అయన ఇంటి చుట్టూ చెక్కర్లు కొట్టడం, ఫోన్ లో బెదిరింపులకు పాల్పడడం పట్ల రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖడిస్తుందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన శ్యామ్ సుందర్ దేవుడా ని వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎక్కడి నుండో వ్యాపారాల కొరకు వచ్చిన మార్వాడీలు స్థానిక బీసీ సర్టిఫికెట్స్ పొంది ఇక్కడి బీసీ బిడ్డల అవకాశాలు కోళ్లగొట్టాలి అనుకోవడం దుర్మార్గమని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని, ఇది వరకే మార్వాడిలకు బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలి, అందుకు సహకరించిన అధికార్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్ది రమేష్ యాదవ్ కు మాదిగ సమాజం అండగా ఉంటుందని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ స్పష్టం చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!