నేటితో ముగిసిన సర్పంచ్ ల పదవి కాలం.
జనం వాయిస్, అమరావతి, ఏప్రిల్ 02:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలో ఐదేళ్ల పాలన కాలం నేటితో అధికారికంగా ముగిసింది, 2021లో ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యుల పదవి కాలం ఏప్రిల్ 2 అర్ధరాత్రి తో పూర్తికావడం తో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది, కొత్తగా ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు వార్డు సభ్యులు కొలువుదీరే వరకు గ్రామంలో పాలన కుట్టు పడకుండా ప్రత్యేక అధికారుల నియమానికి ఉత్తర్వులు జారీ చేసింది..
ప్రభుత్వం. రేపు ఉదయం నుంచి గ్రామ పంచాయతీ లకు తహశీల్దార్లు, ఎంపీడీ వోలు, ఎంఈఓ, ఇతర గెజిటెడ్ స్థాయి అధికారు లు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు స్వీకరించారు సర్పంచుల రికార్జులను, చెక్ పవర్ బాధ్యతలను ప్రభుత్వ ఆదేశాలతో ఇప్ప టికే సంబంధిత అధికారులకు అప్పగించారు.
జిల్లా కలెక్టర్లు తమ పరిధి లోని గ్రామాలకు అధికారు లను కేటాయిస్తూ ఇప్పటికే నియామక ప్రక్రియను పూర్తి చేశారు. నిధులు విత్ డ్రా, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర విధులను ప్రత్యేక అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments