EPAPER
Thursday, April 2, 2026
Google search engine

అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండి.

📰 Generate e-Paper Clip

అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండి.

– అవినీతి జీరో లెవల్ తీసుకురండి.

– హన్మకొండ, కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టమైన సందేశం.

జనం వాయిస్, హన్మకొండ :

అవినీతి సొమ్ముతో సంతోషం ఉండదు, ఉన్నదాంట్లో సంతృప్తి నేర్చుకోండని హనుమకొండ జిల్లా కలెక్టర్. స్నేహ శబరీష్ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన, కఠినమైన హెచ్చరిక చేశారు. నూతన సంవత్సర సందర్భంగా జ్వాల,  లోక్ సత్తా సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిర్వహించిన అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేసి అవినీతికి పాల్పడనంటూ అధికారికంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన సాలరీకంటే ఎక్కువగానే ఇస్తోందని, అయినా లంచాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. అవినీతితో ఎంత సంపాదించినా శాంతి, సంతోషం ఇవ్వదు అని హితవు పలికారు. సీసీ కెమెరాల అమలు, పారదర్శక పాలనతో అవినీతిని నియంత్రిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్‌సత్తా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి 8 దశాబ్దాలు గడిచినా అవినీతి తగ్గకపోవడం బాధాకరం అన్నారు. క్యాలెండర్లలో అంకెలు మారుతున్నాయి గానీ, ప్రభుత్వ శాఖల్లో లంచాల సంస్కృతి ఇంకా మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిపరులకు శిక్ష పడేలా పౌరులను చైతన్యం చేస్తామని, నిజాయితీ గల ఉత్తమ అధికారులను ప్రతి ఏటా సన్మానిస్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఎల్.బి. కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ ముండ్రాటి సదానందం, ఎన్.ఎస్.ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్, లోక్‌సత్తా & జ్వాల సభ్యులు బుర్రి కృష్ణమూర్తి, పొట్లపల్లి వీరభద్ర రావు, కామిడి సతీష్ రెడ్డి, బుద్దే సురేష్, శేషిదర్ రెడ్డి, శంకుమార్, ఎన్సీసీ, ఎన్. ఎస్. ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నేతృత్వంలో హనుమకొండలో నిజాయితీకి బలమైన ముద్ర పడింది. ఇది మాటలకే పరిమితం కాకుండా, చర్యలతో అమలయ్యే అవినీతి వ్యతిరేక సంకల్పం అని ఈ కార్యక్రమం చాటి చెప్పింది…


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!