పరిణీతి చోప్రా అన్‌ఫాలో పై సైనా రియాక్షన్ ఇదే!
జనం వాయిస్, స్పోర్ట్స్ న్యూస్:
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, తన బయోపిక్‌లో తన పాత్ర పోషించిన నటి పరిణీతి చోప్రా తనను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సైనా, ఈ విషయం తాను అసలు గమనించలేదని తెలిపారు. ట్రైనింగ్, టోర్నమెంట్లు, ఈవెంట్లతో ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల సోషల్ మీడియా విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టనని పేర్కొన్నారు.
అన్‌ఫాలో వంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన సైనా, పరిణీతి చోప్రాతో తమ అనుబంధంపై కూడా క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం ఎప్పుడూ మంచి స్నేహితులమని చెప్పుకోలేదని, సినిమా అవసరాల కోసమే కలిసినట్లు చెప్పారు. తన జీవిత ప్రయాణం గురించి వివరించేందుకు మాత్రమే సమావేశాలు జరిగాయని వెల్లడించారు.
షూటింగ్ సమయంలో కలిసి లంచ్‌లు లేదా డిన్నర్లకు వెళ్లలేదని, రెండు మూడు వారాలకు ఒకసారి గంట లేదా రెండు గంటలు మాత్రమే కలిసేవాళ్లమని చెప్పారు. ఆ సమయంలో కూడా దర్శకుడు మా మధ్య ఉండేవారని తెలిపారు. కలిసి ఎక్కువ సమయం గడపనప్పుడు ఫాలో లేదా అన్‌ఫాలో వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని సైనా నెహ్వాల్ పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments