మంథని లో తప్పిన ప్రమాదం.
-ఆర్టీసీ డిపో ప్రహరీ గోడను ఢీ కొట్టిన టిప్పర్.
జనం వాయిస్, మంథని:
పెద్దపల్లి జిల్లా మంథని లో మంగళవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది.ఆర్టీసీ డిపో ప్రహారీ గోడను టిప్పర్ ఢీకోట్టింది.గోదావరిఖని నుండి భూపాలపల్లికి వెళ్ళుతున్న బొగ్గు టిప్పర్ అదుపు తప్పి డిపో ప్రహారీ గోడను ఢీకొట్టడంతో గోడ ధ్వంసం అయింది. దీంతో టిప్పర్ ముందు భాగం నుజ్జు అయ్యింది. ఈ ఘటన తెల్లవారున జరగడంతో ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా మంథని పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments