నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.
జనం వాయిస్, తెలంగాణ:
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన నేడు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు తదితర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం మరియు విస్తరణపై కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండాలు ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కార్యక్రమాలను పరిమితంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments