మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు.!
జనం వాయిస్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మార్చి 13తో ఇంటర్మీడియ ట్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో వెంటనే పదవ తరగతి పరీక్షలు చేపట్టేలా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026ను మార్చి 16న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పలు వెర్షన్ లలో పరీక్ష టైమ్‌టేబుల్ సిద్ధం చేస్తుండడం వల్ల అధికారిక తేదీలు ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోంది.ఈ సంవత్సరం ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ప్రతి పరీక్ష మధ్య ఒకటి లేదా రెండు రోజుల విరా మం ఇవ్వడం, సీబీఎస్ఈ విధానంలా నిర్వహించడం వంటివాటిని పరిశీలిస్తోంది.ఇది గత సంవత్సరాలతో పోల్చితే పెద్ద మార్పే. ఎందు కంటే అప్పట్లో పలు పరీక్ష లు వరుసగా జరిగేవి. నిపుణుల సూచనలు, విద్యార్థుల స్ట్రెస్ విశ్లేషణ ఆధారంగా పరీక్షల మధ్య విరామం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వడానికి సహాయపడుతుందని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భావిస్తోంది.పరీక్ష షెడ్యూల్‌ను కొంచెం పొడిగించడం వల్ల విద్యార్థుల ఆందోళన తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ కు రివిజన్‌కు సమయం దొరికేలా చేస్తుందని చెబుతున్నారు.మరోవైపు, ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభం అవుతాయి. మార్చి13న ఇంటర్ మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి.ఆ తర్వాత రెండు రోజుల విరామం ఇచ్చి మార్చి16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభిం చాలని అధికారులు ప్రణాళికలు వేసుకున్నారు.అదే నెలలో ఉగాదితో పాటు శ్రీరామనవవి, రంజాన్, మహావీర్ జయంతి వంటి పండుగలు వస్తున్నాయి. దీంతో ఆ సమయాల్లో సెలవులు ఇస్తే విద్యార్థులు చదువుకునేం దుకు వీలుంటుందన ఆ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను రూపొందించి నట్లు తెలుస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments