EPAPER
Thursday, April 2, 2026
Google search engine

తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్!

📰 Generate e-Paper Clip

తెలంగాణ పదవ తరగతి పరీక్షల షెడ్యూల్.!


జనం వాయిస్, తెలంగాణ:


హైదరాబాద్: డిసెంబర్‌10 తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలుత ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి.
ఆ తర్వాత మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈసారి పదవ తరగతి పరీక్షల్లో సమయంలో హాలిడేస్ రావడంతో ఒక్కో పరీక్షకు నాలుగు,ఐదు,రోజుల గ్యాప్ వస్తుంది,ప్రతి పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించి నున్నారు.
సైన్స్ పేపర్ రెండు భాగాలుగా రెండు రోజులు జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు సైన్స్ పేపర్ 1, పేప 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్!


*పూర్తి షెడ్యూల్ వివరాలు*

14 మార్చి 2026 – ఫస్ట్ లాంగ్వేజ్

18 మార్చి 2026 – సెకెండ్ లాంగ్వేజ్

23 మార్చి 2026 – థర్డ్ లాంగ్వేజ్

28 మార్చి 2026 – మాథెమాటిక్స్

02 ఏప్రిల్ 2026 – ఫిజికల్ సైన్స్

07 ఏప్రిల్ 2026 – బయోలాజికల్ సైన్స్

13 ఏప్రిల్ 2026 – సోషల్ స్టడీస్

ప్రతి ఎగ్జామ్ కి దాదాపు నాలుగు రోజుల గ్యాప్ రావడంతో విద్యార్థులకు పండగల ఒత్తిడి ఉండదని అధికారులు చెబుతున్నా రు. ఫెస్టివల్ టైమ్ లో ఎక్కువ గ్యాప్ రావడంతో ప్రిపేర్ అవడానికి విద్యార్థులకు సమయం దొరుకుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారికంగా పరీక్షల షెడ్యుల్ విడుదల చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల DEO లకు, స్కూల్ హెడ్ మాస్టర్ లకి విద్యాశాఖ సమాచారం పంపింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!