EPAPER
Sunday, February 15, 2026
Google search engine

కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి-అభివృద్ధికి సహకరించండి.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి-అభివృద్ధికి సహకరించండి.

– రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

– ఈ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దు.

– నేతన్నలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.

– వ్యాపారస్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.

– బిఆర్ఎస్ ఎమ్మేల్యే పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు.

– జమ్మికుంట ఎన్నికల ప్రచారం లో మంత్రి శ్రీధర్ బాబు.

జనం వాయిస్, జమ్మికుంట:

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తున్నామని ఇప్పుడు నేతన్నలకు కూడా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఈ ప్రాంతంతో మంచి సంబంధాలు ఉన్నాయని,గతంలో అనేక సమస్యల మీద ఇదే గాంధీ చౌరస్తాలో ధర్నాలు నిర్వహించామని,అందులో కొన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలుగా పురుడు పోసుకొని ప్రజలకు అందిస్తున్నామని, పదేళ్ల పాటు అరాచక దోపిడీ పాలనను బీఆర్ఎస్ నాయకులు కొనసాగించారని,దానికి విరుద్ధంగా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. హుజూరాబాద్ ప్రాంతం మరో రాయలసీమ కావొద్దని,సెంటిమెంట్ తో మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. ఎమ్మేల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి టీవీలు, ఫోన్ లో తప్ప ప్రజలకు అందుబాటులో ఉండడని అతని వల్ల ఏం ఉపయోగంలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రణవ్ నాయకత్వంలో ఈ ప్రాంతానికి అధిక నిధులు కేటాయిస్తామని,ఆ బాధ్యత తాను తీసుకుంటానని, హుజురాబాద్ లో బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వ్యాపారస్థులకు,నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, ఆరుకాల వీరేశలింగం,సాయిని రవి,సారంగపాణి,పొనగంటి మల్లయ్య,పట్టణ,మండల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాల్లు,30 వార్డులనుండి పోటీ చేసే అభ్యర్థులు,సీనియర్ నాయకులు,మైనారిటీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!