EPAPER
Wednesday, March 4, 2026
Google search engine

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..!ఇక నుంచి గజగజ వణకాల్సిందే.!

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..!ఇక నుంచి గజగజ వణకాల్సిందే.!

జనం వాయిస్, తెలంగాణ :

చలికాలం వచ్చేసింది. ఇక నుంచి గజగజ వణకాల్సిందే. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ఇవాళ ఉదయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, మల్కాజ్‌గిరి, కాప్రా, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 13 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు.

వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ.. కనిష్ఠ తీవ్రత కొంచెం అధికంగా ఉండి పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అలాగే ఉదయం 4 గంటల ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. సాధారణంగా నవంబర్ నెలలో పొడి వాతావరణం ఉంటుందని భావించినప్పటికీ.. రానున్న రోజుల్లో చలి అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోందన్నారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు చలి తీవ్రత మరింత విపరీతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

చలి నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నందున ఉన్ని, మందపాటి దుస్తులు, స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు, గ్లోవ్స్, సాక్స్ ధరించాలి. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో తల, చెవులు, కాళ్లను పూర్తిగా కప్పి ఉంచాలి. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా.. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. గోరువెచ్చని నీటిని తరచుగా తాగడం మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు, విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వేడి వేడి సూప్‌లు,పానీయాలు కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు చలికి త్వరగా ప్రభావితమవుతారు. వారిని ప్రత్యేకంగా వెచ్చగా ఉంచడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే రూమ్ హీటర్లను ఉపయోగించండి, కానీ గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!