EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

లడ్డూ కల్తీపై వైసీపీ దారి మళ్లింపు రాజకీయాలు: మంత్రి అనిత.

📰 Generate e-Paper Clip

  • లడ్డూ కల్తీపై వైసీపీ దారి మళ్లింపు రాజకీయాలు: మంత్రి అనిత.
  • – సభలో చర్చకు సిద్ధమంటే కొత్త ఆరోపణల వల
  • – ఇందాపూర్–హెరిటేజ్ పేర్లు లాగడం రాజకీయ కుతంత్రం
  • – ప్రజల విశ్వాసంపై రాజకీయాలు ఆడొద్దని హెచ్చరిక
  • జనం వాయిస్,అమరావతి :
  • లడ్డూ కల్తీ అంశంపై ప్రభుత్వం సభలో సమగ్ర చర్చకు సిద్ధమని ప్రకటించగానే వైసీపీ నేతలు కావాలనే దారి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు. అసలు విషయంపై చర్చించకుండా ఇందాపూర్, హెరిటేజ్ సంస్థల పేర్లు లాగుతూ అనవసర వివాదం సృష్టించడం వెనుక దురుద్దేశం ఉందని ఆమె ఆరోపించారు. లడ్డూ తయారీకి సంబంధించిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే సంబంధిత అధికారులతో పాటు పూర్తి వివరాలు సభలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు. అయితే వైసీపీ నేతలు తమ పాలనలో జరిగిన లోపాలు బయటపడతాయనే భయంతో కొత్త కొత్త కథనాలు అల్లుతున్నారని విమర్శించారు. ఇందాపూర్, హెరిటేజ్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. లడ్డూ వంటి పవిత్ర ప్రసాదం అంశాన్ని రాజకీయ లాభనష్టాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. భక్తుల విశ్వాసం దెబ్బతినేలా తప్పుడు ప్రచారాలు చేయడం సమంజసం కాదని హెచ్చరించారు. వాస్తవాలను ఎదుర్కోలేక వైసీపీ నేతలు మాయమాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు తెలియజేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఎలాంటి ఆరోపణలైనా ఆధారాలతో రావాలని, చర్చకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. లడ్డూ వ్యవహారంలో పారదర్శకత పాటిస్తామని, ప్రజల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!