ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం.
-ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన.
జనం వాయిస్,డెస్క్:
దీపావళి వేళ ఏపీ ఉద్యోగులు అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు.ఇప్పటికే ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించారు.నవంబర్ 1న డీఏ జమ చేస్తామని చెప్పారు.పోలీసులకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఈఎల్ ఇస్తామని అన్నారు.దీపావళికి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు.కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.దాంతో పాటు ఎర్న్ లీవ్ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ‘‘ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.2,793 కోట్లు ఇచ్చాం.. 74 కేంద్ర పథకాలను రెగ్యులరైజ్ చేశాం.. దక్షిణ భారతదేశంలో మనం వెనుకబడే పరిస్థితికి వచ్చాం.. స్ట్రక్చరల్ కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి.ఈ క్రమంలో ఉద్యోగులే ప్రధాన భాగస్వాములు.. వెల్దీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఏర్పడాలి’’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments