తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.
జనం వాయిస్ దినపత్రిక:
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారినినిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు(ఆదివారం) శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సర్వ దర్శనం కోసం భక్తులు 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(శనివారం) శ్రీవారిని 82,136 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,023 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.శ్రీవారిహుండీ ఆదాయం రూ.3.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments