EPAPER
Wednesday, June 3, 2026
Google search engine

నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి.

📰 Generate e-Paper Clip

నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి.

-జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి.


జనం వాయిస్,పెద్దపల్లి:


నవంబర్ 13 లోపు పదవ  తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వుల  ప్రకారం పదవ తరగతి, ఒకేషనల్, ఓ ఎస్సిస్సి మార్చి-2026 పరీక్షలు రాసే విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా నవంబర్  13 లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.50=00 ఫైన్ తో నవంబర్-29 వరకు, రూ.200=00 ఫైన్ తో డిసెంబర్-11 వరకు, రూ.500=00 లేట్ ఫీజుతో డిసెంబర్-29 వరకు ఫీజు చెల్లించవచ్చని , పరీక్ష ఫీజు, దరఖాస్తుల వివరాలు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు వద్ద లభిస్తాయని తెలిపారు.రెగ్యులర్ విద్యార్థులు రూ.125=00, ఫెయిల్ అయిన విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకు రూ.110=00, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125=00 ఫీజుగా చెల్లించాలని, మిగతా వివరాలకు www.bse.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని, నోటిఫికేషన్ లో సూచించిన ఫీజు కాకుండా అదనంగా ఫీజులు విద్యార్థుల నుండి వసూలు చేయరాదని, అలా వసూలు చేసిన పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ ఆధికారి,డి.మాధవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!