నేటి నుంచి శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు
-అభిషేకాలు రద్దు, విడతల వారీగా మల్లన్న స్పర్శ దర్శనం
జనం వాయిస్ దినపత్రిక:
శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. కార్తిక మాసంలో రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లు రద్దు చేసినట్లు తెలిపారు. రోజూ విడతల వారీగా మల్లి కార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. శని, ఆది, సోమవారాల్లో అమ్మవారి అంతరాలయంలో కుంకు మార్చనలు నిలిపేసి.. ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, నవంబర్ 14న కోటి దీపోత్సవం, 18న తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హోమాలు, కల్యాణాలు యథావిధిగా జరుగుతాయన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments