EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా.

📰 Generate e-Paper Clip

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా.

చౌదరిగుడా గ్రామపంచాయతీలో సర్పంచ్ నిర్లక్ష్యం.

గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.

షాద్ నగర్, జూన్ 02, జనం వాయిస్:

జిల్లేడు చౌదరిగూడా గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా ఓ ఘోర తప్పిదం చోటుచేసుకుంది. జాతీయ జెండాను గౌరవించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌదరి గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాతీయ జెండాను తలకిందులుగా ఆకుపచ్చ రంగు పైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా తాడుకు కట్టారు. కనీసం చూసుకోకుండా ఆ జెండాను అలాగే పైకి ఎగురవేసి, ఆవిష్కరించారు. జాతీయ జెండాపై ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తికి దేశభక్తులను అవమానపరిచినట్లు అని అన్నారు. జాతీయ జెండాపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇంత పెద్ద వేడుకలో ఇలాంటి పొరపాటు జరగడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!