గోదావరిఖనిలో ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.
జనం వాయిస్, గోదావరిఖని, మే 19:
తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ లను మంగళవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఈనెల 25, 26 తేదీలలో హైదరాబాద్ లో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై కళారూపాల ద్వారా పోరాడుతున్న ప్రజానాట్యమండలి మహాసభల కు హార్థిక, ఆర్థిక సహకారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజానాట్యమండలి పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎజ్జ రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, కళాకారులు జే. రాజు, రేణికుంట్ల రమాదేవి, నూకల మొండయ్య, జే. మోహన్, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్, కవులు, రచయితలు, యూనియన్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments