దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు.
- ప్రజలు, మండపాల నిర్వాహకులు సహకరించాలి.
- రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి పిలుపు.
జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 20:
దుర్గామాత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించనున్న విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా ప్రజలు, ఉత్సవ కమిటీల నిర్వాహకులు సహకరించాలని కోరారు. గోదావరి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలను, ప్రశాంత్ నగర్ చెరువు, రామగుండం చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మండపాల నిర్వాహకులు అధికారుల సూచనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన భక్తులు నిమజ్జన సమయంలోనూ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులకు, సంబంధిత అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తులు, నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించి నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్తఫా, మాజీ అధ్యక్షుడు బొంతల రాజేష్, సీఐ ఇంద్రసేన రెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments