EPAPER
Friday, November 13, 2026
- Advertisment -spot_img

‘ఇడుపు కాగితం’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు!

📰 Generate e-Paper Clip

‘ఇడుపు కాగితం’ డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు!

టీజర్‌ను మించిన ట్రైలర్.. టికెట్ డబ్బులకు పూర్తి విలువ: చిత్ర బృందం

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం.. ఆకట్టుకోనున్న ప్రియదర్శి, నాగదుర్గ నటన

జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:

హీరో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాగితం’ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. టీజర్ కంటే ట్రైలర్ మరింత బాగుంటుందని, ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకు పూర్తి విలువ ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రియదర్శి, నాగదుర్గ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. ఇది చక్కటి ఫ్యామిలీ డ్రామా అని, ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటుందని పేర్కొంది. మొదట ఫ్యామిలీ డ్రామా కావడంతో కొంత ఆలోచించినప్పటికీ, ఇలాంటి కథలనే ప్రేక్షకులు ఆదరిస్తారని తబిత ప్రోత్సహించారని తెలిపారు. తమ బృందంలోని యువత ఈ సినిమాను రూపొందించగా, నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక బాధ్యతలను తాము చూసుకున్నామని వెల్లడించారు. సినిమా చూసి ఎంతో ఆస్వాదించామని, ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ.. సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో మరిన్ని మంచి పాటలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అద్భుతమైన సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన హీరో ప్రియదర్శి, దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. నిజాయితీగా కథ చెబితే అది ప్రతి ఒక్కరికీ చేరువవుతుందని, ఈ విషయం ఎన్నోసార్లు చిత్ర పరిశ్రమలో నిరూపితమైందన్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే సంఘటనలతో ముడిపడిన కథ ఇదని, ఫ్యామిలీ డ్రామాను మించిన డ్రామా మరొకటి ఉండదని పేర్కొన్నారు. ఈ సినిమాకు తబిత అక్క ఎంతో ధైర్యం ఇచ్చారని, సినిమా చేయాల్సిందేనని ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఈ చిత్రానికి బన్నీ వాస్ తొలి పిల్లర్ అని, ఆయనలో గొప్ప దర్శకుడు కూడా ఉన్నారని ప్రశంసించారు. దర్శకుడు వంశీరెడ్డి లాంటి మంచి మనసున్న సాంకేతిక నిపుణుడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. నాగదుర్గ ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటారని, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో ప్రియదర్శి, నాగదుర్గతో పాటు శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), వినోద్ బాల, అభినవ్ గోమటం, సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు నటిస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!