EPAPER
Saturday, November 7, 2026
Google search engine
- Advertisment -spot_img

రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు!

📰 Generate e-Paper Clip

రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే కేసులు తప్పవు!

  • వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు.
  • రైతులు కల్లాలు, సొంత స్థలాల్లోనే ధాన్యం ఆరబెట్టాలి.
  • ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్ హెచ్చరిక.

జనం వాయిస్, ముత్తారం, నవంబర్ 06:

రోడ్లపై ధాన్యం ఆరబోస్తూ వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముత్తారం ఎస్ఐ ఎన్. రవికుమార్ హెచ్చరించారు. రహదారులపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాల టైర్లు జారి ప్రమాదాలు జరిగే అవకాశముందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురయ్యే ముప్పు ఉందని పేర్కొన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు రహదారులను వినియోగించకుండా కల్లాలు, తమ సొంత స్థలాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రహదారులు వాహనాల రాకపోకల కోసం మాత్రమేనని, వాటిపై ధాన్యం ఆరబోయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించినట్లవుతుందని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రమాదాల నివారణకు రైతులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ రవికుమార్ కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!