పవన్ కల్యాణ్ కు 4 పెళ్లిళ్లు అయ్యే యోగం ఉంది: వేణు స్వామి పాత వ్యాఖ్యలు వైరల్.
- విడిపోతున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల.
- పవన్, అన్నా విడిపోతారని 2023లో ప్రకటించిన వేణు స్వామి.
- పవన్ దంపతులు విడిపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేణు స్వామి.
జనం వాయిస్, వెబ్ డెస్క్, నవంబర్ 10:
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్లు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు.
“పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. జీవితంలో ఎంతోకాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతాం. పిల్లల తల్లిదండ్రులుగా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత పరిణామంలో మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని తెలిపారు.
పవన్ కల్యాణ్, అన్నా 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు సమాచారం.
ఈ పరిణామంతో… ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పి వార్తల్లో నిలిచిన వేణు స్వామి… 2023లో పవన్ కల్యాణ్ మూడో వివాహం కూడా నిలవదని జోస్యం చెప్పారు. అయితే ఆయన చెప్పిన మూడేళ్ల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. పవన్ జాతకంలో గురువు నీచ స్థానంలో 6వ ఇంట్లో ఉండడం వల్లే ఇలా జరుగుతుందని, ఆ గ్రహ స్థితి ఆధారంగానే ఆయన మరో వివాహం చేసుకుంటారని అనడం గమనార్హం. ఏదేమైనప్పటికీ పవన్, అన్నా విడిపోవడంతో… వేణు స్వామి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments