తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు..!
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 18:
తెలంగాణ లో పలువురు ఐపీఎస్, అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు శని వారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్.చిత్తరంజన్‌ను అదే జిల్లాలో అదనపు ఎస్పీ అడ్మిన్‌గా నియమించారు. కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్యరెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా, జనగామ ఏఎస్పీ పందిరి చేతన్ నితిన్‌ను జగిత్యాల ఏఎస్పీగా బదిలీ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌ను మెదక్ ఏఎస్పీగా, వరంగల్ ఏఎస్పీ నగ్రాలె శుభమ్ ప్రకాశ్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీగా, భైంసా అదనపు ఎస్పీ రాజేశ్ మీనాను వనపర్తి ఏఎస్పీగా నియమించారు. అలాగే ఆదిలాబాద్ ఏఎస్పీ పి.మౌనికను ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) గా, నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీ ఎస్‌డీపీఓగా, వేములవాడ ఏఎస్పీ రుత్విక్‌సాయిని ఉట్నూర్ ఏఎస్పీ ఎస్‌డీపీఓ,గా బదిలీ చేశారు
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments