EPAPER
Friday, April 17, 2026
Google search engine

ప్రధాని నరేంద్ర మోడీకి నాకు..భార్యల సమస్య లేదు: రాహుల్ గాంధీ..!

📰 Generate e-Paper Clip

ప్రధాని నరేంద్ర మోడీకి నాకు..భార్యల సమస్య లేదు: రాహుల్ గాంధీ..!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోకసభలో చాలా హాట్ గా డిస్కషన్ నడుస్తున్న సమ యంలో అందరూ సీరియస్ గా చర్చలో ఉండగా..రాజీవ్ గాంధీ ప్రసంగం కొద్దిసేపు నవ్వులు పూయించారు,ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి, సోదరి, భార్య రూపంలో మహిళ లు ప్రభావం ఎంతో ఉంటుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, అన్నారు.
మనం మహిళను ఒక శక్తిగా, ఒక జీవితాన్ని నడి పించే శక్తిగా చూస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా తల్లి, సోదరి, భార్య ద్వారా ఎంతో ప్రభావితమ వుతారని అన్నారు. అయితే, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. నాకు, ప్రధాని నరేంద్రమోడీ కి,భార్యల సమస్య లేదని అనడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశా యి. తన సోదరి, వయ నాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తన సోదరి చేసిన ప్రసంగం అద్భుత మని కొనియాడారు.
నిన్న, మా 20 ఏళ్ల రాజకీ య జీవితంలో బహుశా నేను చేయలని పనిని నా సోదరి 5 నిమిషాల్లో సాధించడం చూశాను. అదేటంటే ఆమె అమిత్ షాను నవ్వించింది, అని అన్నారు.గురువారం ప్రియాంకాగాంధీ లోక్‌సభ లో మాట్లాడుతూ.. మహి ళా రిజర్వేషన్ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు ఇదిలా ఉంటే, చాణక్యు డిని ప్రస్తావిస్తూ ఆమె వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి.
కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా ప్రియాంకా వ్యాఖ్యలకు నవ్వారు. ‘‘మీరంతా పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఈ రోజు గనుక చాణక్యుడు బతికి ఉంటే మీ కుయుక్తికి ఆయన ఆశ్చర్యపోయి ఉండేవారు.అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలుకే అమిత్ షాతో పాటు… కేంద్ర మంత్రులు కిరెన్ రిజిజు, కూడా నవ్వారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!