గుడ్‌న్యూస్.. జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనం వాయిస్, డెస్క్:
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని (తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TGCAB)) జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎప్పటి నుంచో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ జిల్లాలలో మొత్తం 225 ఖాళీలున్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 6 వ తేదీ ముగుస్తుంది. ఐబీపీఎస్ ఈ పరీక్షలు డిసెంబర్‌లో నిర్వహిస్తుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలకు తమ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని అధికారులు చెప్పారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments