ఫిజియోథెరపీ సేవలాంటిదే…
– మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
జనం వాయిస్, మంథని:
వైద్య చికిత్స విధానంలో ఫిజియోథెరపీ అనేది ఒక గొప్ప సేవలాంటిదేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. రామగిరి మండలం నాగేపల్లి (బేగంపేట ఎక్స్‌రోడ్) లో బాణాల అరుణ్ ఏర్పాటు చేసిన అంజనీ ఫిజియోథెరపీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కేంద్రంలో అందించే సేవలను అడిగి తెలుసుకుని నిర్వాహకుడిని అభినందించారు. వివిధ రోగాలను నయం చేయడానికి వైద్యుడి సేవలు ఎలా పొందుతామో అదే రీతిలో పక్షపాతం, ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన వారికి ఫిజియోథెరపీ సేవలు ఎంతోగానో ఉపయోగపడుతాయన్నారు. అంగవైకల్యం ఉన్నవారికి నిత్యం తమ వంతుగా వైద్యచికిత్స సేవలు అందించి వారిని సాదారణ వ్యక్తిలా మార్చడంతో ఫిజియోథెరపిస్ట్ ఎంతగానో కృషి చేస్తారని కొనియాడారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments